TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో ఇరుక్కున్న 8మందిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్లొన్నారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిరంతరం ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు.