TG: యాదాద్రి ఆలయంలో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం రూ.150 క్యూ లైన్‌లో ఉన్న ఐరన్ గ్రిల్స్‌లో దయాకర్ అనే ఆరేళ్ల బాలుడు తల పెట్టడంతో.. ప్రమాదవశాత్తు అందులో తల ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది బాబు తలను గ్రిల్స్ నుంచి బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.