తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతుండగా.. అక్కడ వాళ్ళకు ఓ నాగుపాము కనిపించింది. ఇంతలో ఓ యువకుడు ఏమాత్రం భయం లేకుండా పాముని చేతితో పట్టుకుని.. తిప్పుతూ ఫ్రెండ్స్ పై విసరడానికి చూశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాములతో ఆటలు ఆడటం ప్రమాదకరమని కామెంట్లు పెడుతున్నారు.