TG: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సాయి ప్రణీత్ (26) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొద్ది రోజులు ఆమెతో సహజీవనం చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోకుండా కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తానన్నాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయదంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.