ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవితను తరలించారు. రాత్రంతా ఆమె ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నారు. కాసేపట్లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. కవిత తరఫు లాయర్లు అత్యవసర విచారణను కోరుతున్నారు. అరెస్ట్‌పై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.