బిహార్‌కు చెందిన యువతి కేరళలోని ఎర్నాకులంలో చేస్తున్న పని నచ్చకపోవడంతో బెంగళూరులో ఉంటున్న తన అన్నయ్య దగ్గరికి వచ్చింది. రాత్రివేళ అన్నతో కలిసి వెళ్తున్న ఆ యువతిపై బెంగళూరులో ఇద్దరు యువకులు దాడి తెగించారు. అన్నయ్యపై దాడి చేసి యువతిని ఆటోలో అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు సయ్యద్, ఆసిఫ్‌లుగా గుర్తించారు.