వక్ఫ్ సవరణ బిల్లు-2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అర్ధారాత్రి దాటేవరకూ రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు సభ ఛైర్మన్ ప్రకటించారు. కాగా ఈ బిల్లు ఈ నెల రెండున లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.