ఉల్లిని సాగును రబీ అక్టోబరు నెల నుండి నవంబరు నెలలో నాటుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు. జూన్ నెల నుండి జూలై నెలలో ఖరీఫ్ పంటకాలంలో, వేసవి పంటగా జనవరి నెల నుండి ఫిబ్రవరి నెలలలో నాటుకోవాలి. సాధారణంగా ఉల్లిసాగులో ఎక్కువగా తామర పురుగు, బల్బ్‌మైట్ నల్లి, ఆకుమచ్చ తెగులు, పచ్చపురుగు, కుళ్లు తెగులు అనే పురుగులు కనిపిస్తాయి. వీటి వల్ల ఉల్లిసాగు ఆశించిన స్థాయిలో ఉండదు. పెరుగుదల ఆగిపోయి గడ్డలు కుళ్లిపోతాయి.