‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP) అనే పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెడితే 115 నెలల్లో (9 సంవత్సరాల 7 నెలల్లో) మనం పెట్టిన సొమ్ము రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద 7.5% వార్షిక వడ్డీని అందజేస్తున్నారు. ఈ పథకంలో రూ.1000 నుంచి పెట్టుబడి ప్రారంభమవుతుంది. మనం ఏక మొత్తంలో రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే ఈ కాలంలో ఈ మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. ఒకవేళ ఖాతాను మూసేయాలనుకుంటే 2 సంవత్సరాల 6 నెలల తర్వాత చేయవచ్చు.