అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు అదే అస్త్రం!

520చూసినవారు
అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు అదే అస్త్రం!
ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ స‌మావేశాల సంద‌ర్భంగా అధికార కాంగ్రెస్‌ను ఏ పాయింట్ మీద ఇర‌కాటంలో పెట్టాల‌న్న‌ది బీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి.ఈ నేప‌థ్యంలో స‌భ‌లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్‌కు పెద్ద‌గా పాయింట్లు దొర‌క‌డం లేదు. అందుకే పార్టీ ఫిరాయింపుల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నుంద‌ని స‌మాచారం. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచిన వాళ్ల‌లో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్