కమల్ హాసన్‌ను చూసి అలా ఉండిపోయా: రాజమౌళి

65చూసినవారు
కమల్ హాసన్‌ను చూసి అలా ఉండిపోయా: రాజమౌళి
ఈనెల 27న విడుదలకానున్న కల్కి మూవీ రిలీజ్ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. ‘‘అమితాబ్‌ జీ, డార్లింగ్‌,దీపిక పాత్రలు మరింత లోతుగా ఉంటాయనిపిస్తోంది. కమల్‌ సర్‌ లుక్‌ దగ్గర నేను ఒక్క క్షణం ఆగిపోయా. ఆయనెప్పుడూ అద్భుతాలనే చేస్తారని మరోసారి నిరూపించారు. నాగీ..‘కల్కి’ ప్రపంచాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్