BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన పార్టీ ఎమ్మెల్యేలు.. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించిన విధానాలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.