TG: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ 8 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ కొనిస్తామని చెప్పి యువకులు తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. చిన్నారిని బంధువులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.