తీహార్ జైలులో యువకుడి దారుణ హత్య (వీడియో)

81చూసినవారు
తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలులో జరిగిన షాకింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలులో 3వ నెంబర్ లో శిక్ష అనుభవిస్తున్న దీపక్ అనే ఖైదీకి.. ఆఫ్ఘనిస్థాన్ నివాసి అబ్దుల్ బషీర్ (44) అనేవ్యక్తికి భోజనం విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అబ్దుల్ పదునైన కత్తితో దీపక్ ను ఛాతీపై పొడిచేశాడు. గాయపడిన దీపక్‌ను డీడీయూ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఢిల్లీలోని షకుర్‌పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్