తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొప్పవరంలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించింది. మొదట చిన్నారి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఇంటి సమీపంలో ఉన్న కాలువలో పడిపోయినట్లు అనుమానం వ్యక్తం చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి చిన్నారి మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.