ప్రొఫెషనల్ షాట్లతో అదరగొడుతున్న బుడ్డోడు.. వీడియో

1091చూసినవారు
దక్షిణాఫ్రికాకు చెందిన హ్యూగో మావెరిక్ హీత్ అనే చిన్నపిల్లోడు ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ తరహాలో ధనాధన్‌ షాట్లతో దుమ్మురేపుతున్నాడు. ఈ బుడ్డోడి ఆటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 3 ఏళ్ల బుడతడు.. ఫుల్ స్వింగ్‌లో బ్యాటింగ్ చేయడమే గాక, పరుగులు తీస్తూ డైవ్ కూడా చేస్తున్నాడు. ఈ చిన్నోడి బ్యాటింగ్ నైపుణ్యం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. దక్షిణాఫ్రికాకు మరో AB డివిలియర్స్‌ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్