మహిళపై కొమ్ములతో గేదె దాడి (వీడియో)

66చూసినవారు
చెన్నైలోని తిరువొత్తియూర్ ప్రాంతంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై మధుమతి (35) అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఆమెపై ఓ గేదె అనూహ్యంగా దాడి చేసింది. తన కొమ్ములతో ఆ మహిళను పైకి ఎత్తి కింద పడేసింది. అంతటితో ఆగకుండా దాదాపు 500ల మీటర్ల దూరం ఆ మహిళను గేదె ఈడ్చుకెళ్లింది. బాధిత మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్