ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోని 21 నగరాల్లో ఆదివారం 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ రాబోయే మూడు రోజులు వేడిగాలులతో వీచే అవకాశముంది. ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలోని నగరాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.