IPLలో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, బెంగళూరు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలువగా.. ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. IPL చరిత్రలో బెంగళూరుపై ముంబైదే పైచేయిగా ఉంది. 33 మ్యాచ్‌ల్లో 19 మ్యాచ్‌లు MI గెలిచింది. అయితే, ఇవాళ్టి మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.