తమిళనాడులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ధర్మపురి జిల్లా ఎట్టియంపట్టికి చెందిన 50 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఓ ప్రైవేట్ బస్సులో మేల్మరువత్తూరుకు బయలుదేరారు. ఆదిపరాశక్తి ఆలయంలో ఉపవాస దీక్షల కోసం వారంతా వెళ్లారు. అయితే ఉత్తంగరై సమీపంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో బస్సులోని 40 మందికి గాయాలయ్యాయి. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.