CA : పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం

71చూసినవారు
CA : పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం
పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ 14వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫైజ్ ఇసా అధ్యక్ష భవనంలోని ఐవాన్-ఇ-సదర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరో ఐదు నెలల పాటు పదవిలో కొనసాగిన డాక్టర్ ఆరిఫ్ అల్వీ స్థానంలో జర్దారీ నియమితులయ్యారు. దీంతో జర్దారీ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పాక్ చరిత్రలో రెండుసార్లు ఈ పదవిని చేపట్టిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్