రాజకీయాల్లోకి టీం ఇండియా మాజీ క్రికెటర్!

63చూసినవారు
రాజకీయాల్లోకి టీం ఇండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ గతేడాది క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారట. ఫడ్నవీస్‌తో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్