ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మతిస్థిమితం లేని మహిళ రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై ఇటుకలతో దాడి చేసింది. ఈ దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో చోటుచేసుకుంది.