దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1089.18 పాయింట్లు లాభపడి 74,227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద స్థిరపడింది. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో స్టాక్ మార్కెట్ పుజుకుంది. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, L&T, SBI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.27గా ఉంది.