పెళ్లి ఊరేగింపులో వరుడుపై దుండగులు కాల్పులు జరిపిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పెళ్లి కుమారుడు సచిన్ పాండేను సోమవారం రాత్రి బగ్గీపై ఊరేగిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. లక్కీగా అతడు తల కిందకు దించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతడు బగ్గీ నుంచి కిందకు దిగి, బంధువుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వరుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.