యూపీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లా మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై బాలెనో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కారు డ్రైవర్ వెంటనే కిందకు దూకేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.