కారు ఢీ.. మహిళ స్పాట్‌డెడ్ (వీడియో)

75చూసినవారు
పంజాబ్‌ లూథియానాలోని హరగోవింద్ నగర్ ప్రాంతంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. వ్యాయామం చేసేందుకు జిమ్‌కు వెళ్తున్న మహిళను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాధిత మహిళ చనిపోయింది. మృతురాలిని స్వీటీ అరోరా (33)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్