షాకింగ్ ఘటన.. చితి మంటల్లో దూకి ఆత్మహత్య

58చూసినవారు
షాకింగ్ ఘటన.. చితి మంటల్లో దూకి ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మనవడి చితి మంటల్లో దూకి తాత ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అభయ్ రాజ్ యాదవ్ శుక్రవారం తన భార్య సవితా యాదవ్‌ను చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో అతడి తాత రామావతార్ యాదవ్ కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు వెతికే క్రమంలో శ్మశాన వాటికకు వెళ్లగా అక్కడ ఆయన సగం కాలిన మృతదేహం కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్