SRSP కాలువలో పడ్డ కారు.. తండ్రి, కొడుకు, కూతురు మృతి

61చూసినవారు
వరంగల్ జిల్లా సంగెం (M) తీగరాజుపల్లి సమీపంలోని SRSP కెనాల్లో కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు, కొడుకు) మృతి చెందారు. గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో మరొకరిని కాపాడారు. ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తించారు. తల్లిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని ఎంజీఎం మార్చురీకి తరలించారు. గ్రామంలో మృతుల బంధువులు రోదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్