యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫతేపూర్ జిల్లాలో హోటల్ ముందు ఆగి ఉన్న బస్సును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.