లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు

82చూసినవారు
లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు
AP: విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అయితే నాని ఆయనకు క్షమాపణ కూడా చెప్పారు. కానీ సజ్జనార్ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న విశాఖ సీపీ వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ పోలీసులు నానిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్