లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని నరకయాతన.. చివరికి!

57చూసినవారు
లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని నరకయాతన.. చివరికి!
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదం చోటు చేసుకుంది. లారీ, పాల ట్యాంకర్ మధ్య డ్రైవర్ ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. కొద్దిసేపటి తర్వాత ప్రాణాలు విడిచాడు. మారేడుపల్లికి చెందిన డ్రైవర్ సుందరరాజన్ పని నిమిత్తం లారీతో శనివారం అర్ధరాత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. లారీ టైర్లలోని రాళ్లను తొలగిస్తుండగా.. ట్యాంకర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి దూసుకొచ్చింది. ఈ క్రమంలో లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని డ్రైవర్ చనిపోయాడు.

సంబంధిత పోస్ట్