నేడే IND vs PAK మ్యాచ్

79చూసినవారు
నేడే IND vs PAK మ్యాచ్
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. ఆ మజానే వేరు. బాల్ బాల్‌కి నరాలు తెగేంత టెన్షన్ ఉంటుంది. సై అంటే సై అంటూ ఇరు జట్ల ఆటగాళ్లు పూనకాలతో ఊగిపోతారు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హైఓల్టేజీ మ్యాచ్ మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా మొదలవనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలుపు ఎవరిది అనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్