ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభామేళాకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 26న మహాకుంభా మేళా ముగుస్తుంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల మందికి పైగా విచ్చేసి పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.