భారత్, పాక్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 2, పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. చివరిసారిగా 2017 CTలో భారత్‌ను 180 పరుగుల తేడాతో ఓడించి పాకిస్థాన్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక, వన్డేల్లో భారత్, పాక్ జట్లు ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 57 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్, టీ-20 WCలలో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి.