దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూజీసీ నెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 జనవరి 3 నుంచి 27 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆదివారం ప్రకటించింది. ఫలితాల కోసం ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.