TG: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు హర్ష సాయిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హర్షసాయిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ వివరించారు.