బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించారు. 2016లో తాను ఓ గేమింగ్ యాప్ ప్రమోట్ చేశానని, అది తెలియక చేశానని చెప్పారు. ఆపై ఎలాంటి గేమింగ్ యాప్స్ తాను ప్రమోట్ చేయలేదని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు.