విజయవాడలోని A-కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం ఉత్సాహంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. 'ఏమంటివి..ఏమంటివి?' అంటూ దానవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.