ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. ఈ మ్యాచ్ శ్రీరామనవమి పండుగ రోజున రావడంతో కోల్‌కతా పోలీసు అధికారులు భద్రత కల్పించలేమని చెప్పారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను వాయిదా వేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను కోరారు. దీంతో కోల్‌కతాలో జరగాల్సిన ఈ మ్యాచ్ వేదికను గౌహతికి మార్చారు.