ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని మంత్రి సతీశ్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. బాధితుల్లో జాతీయ నాయకులు సహా 48 మంది నేతలు ఉన్నట్లు మరో మంత్రి కేఎన్ రాజన్న తెలిపారు. దీంతో కేఎన్ రాజన్న వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం హనీ ట్రాప్ కేసులపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.