547 కేంద్రాల ద్వారా పంట సేకరణ: మార్కెఫెడ్

56చూసినవారు
547 కేంద్రాల ద్వారా పంట సేకరణ: మార్కెఫెడ్
AP: రాష్ట్రంలో 547 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ పారదర్శకంగా జరుగుతోందని మార్క్ ఫెడ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కందికి క్వింటాల్‌కు రూ.7,550, శనగలకు రూ.5,650, పెసలుకు రూ.8,682 మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే CMAPP ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్