గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో సెప్టెంబర్ 29న జరిగిన ఓ ఘటన బుధవారంఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి (36) పని నిమిత్తం ఆఫీస్ లోకి వెళ్లి కూర్చొన్నాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.