ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీమా ఏజెంట్ జలేంద్ర అనే వ్యక్తి వ్యాయామం కోసం జిమ్ కి వెళ్ళాడు. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. వెంటనే అతనికి జిమ్ లో ఉన్న వ్యక్తులు సీపీఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.