తమిళనాడులోని బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. తిరుపూర్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఈదురు గాలుల ధాటికి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్ పై అద్దాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అవుతున్నా బస్సులోని ప్రయాణికులందరినీ ప్రమాదంలో పడకుండా క్షేమంగా కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు డ్రైవర్ వేగంగా బస్సు నడపటమే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.