జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఉగ్రదాడిలో చనిపోయిన వారికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇవాళ నివాళులర్పించారు. ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు నిన్న జరిపిన దాడికి ఆర్ఎఫ్ఎన్ జీవన్ సింగ్, ఆర్ఎఫ్ఎన్ కైసర్ అహ్మద్ షా, డిఫెన్స్ పోర్టర్లు ముస్తాక్ అహ్మద్ చౌదరి, జహూర్ అహ్మద్ మీర్ మరణించారు. వారి మృతదేహాలపై మనోజ్ సిన్హా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.