TG: న్యాయం చేయాలంటూ పత్తి రైతు ఓ అధికారి కాళ్లు మొక్కిన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌరస్తాలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పత్తి రైతులు రోడ్డుపై బైఠాయించారు. కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో భారీగా నష్టపోతున్నామంటూ రైతులు వాపోయారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యే శరణ్యమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.