ఇస్రో 2029లో చేపట్టనున్న శుక్రయాన్ మిషన్ కు (శుక్రయాన్-1) రూ.1236 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రగ్రహంపై ఇస్రో చేపట్టనున్న తొలి ప్రయోగం ఇది. లాంచ్ వెహికల్ మార్క్-3(LVM-3)రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ మిషన్ ద్వారా శుక్రగ్రహం ఉపరితలం, వాతావరణ మార్పులు, అయనోస్ఫియర్, దట్టమైన కార్బన్ డై ఆక్సైడ్ , సల్ఫ్యూరిక్ ఆమ్లం, క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించడంతోపాటు గ్రహం భౌగోళిక కార్యకలాపాలను పరిశీలించవచ్చు.