జికా వైరస్‌పై అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం

63చూసినవారు
జికా వైరస్‌పై అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం
మహరాష్ట్రలో ‘జికా వైరస్’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. జూలై 1 నాటికి పూణేలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. గర్భిణీ స్త్రీలకు జికా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, జికా వైరస్ పాజిటివ్‌గా తేలితే తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్