AP: ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ.. వైఎస్ జగన్ రాజకీయ అడ్డా అయిన పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది. ఈ మేరకు జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా టీడీపీ ప్లాన్ వేస్తోంది. అక్కడ బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ కేడర్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు వైసీపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు ఈరోజు టీడీపీలో చేరడంతో దీనికి బలం చేకూరింది.